- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP: ఎన్నికలోస్తే పొత్తులు పెట్టుకోవడం బాబుకు కొత్తేం కాదు: సజ్జల రామకృష్ణా రెడ్డి హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలొచ్చాయంటే చంద్రబాబుకు పొత్తులు పెట్టుకోవడం కొత్తమీ కాదని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రధాని మోడీని నొటికొచ్చినట్లుగా తిట్టిన చంద్రబాబే ఇప్పుడు ఆయనను కీర్తించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పొత్తులతో ప్రజలను మోసగిస్తున్నామనే భావనే వాళ్ల ముఖాల్లో కూసింతైనా కనిపించడం లేదని ఫైర్ అయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రజా వ్యతిరేక కూటమి అంటూ ఆయన విమర్శనాస్త్రాలను సంధించారు. గతంలో ఇదే బీజేపీ పార్టీని పట్టుకుని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాచిపోయిన లడ్డూలంటూ ఎద్దేవా చేశారని గుర్తు చేశారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు పూర్తి విస్మరించారని ఆరోపించారు. మళ్లీ సరిగ్గా పదేళ్ల తరువాత చంద్రబాబు, పవన్ ఇద్దరూ అదే నాటకానికి తెర లేపారని దుయ్యబట్టారు. 2014లో ఎందుకు కలిసి పోటీ చేశారు.. మళ్లీ ఎందుకు విడిపోయారో వారికే తెలియదని అన్నారు. అప్పుడు విడిపోయి మరి ఇప్పుడెందుకు కలిశారో చెప్పాలన్నారు. బాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను మ్యానిఫెస్టోలో చూపించి ఇంటర్‌నెట్ నుంచి డిలీట్ చేశారని ఆరోపించారు. అబద్ధాలు, మోసం, బాధ్యతారాహిత్యం వాళ్లలో కట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. కేవలం సీఎం జగన్‌ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. నిన్న జరిగిన ప్రజాగళం సభ విఫలమైందంటూ సెటైర్లు వేశారు. చిన్న సభను నిర్వహించకోవడం చేతకాకే ఆ అపవాదును పోలీసుల మీదకు నెట్టేస్తున్నారని ఆరోపించారు. కనీసం దేశం ప్రధానిని సత్కరించేందుకు శాలువా, పుష్పగుచ్ఛం కూడా తీసుకురాని పార్టీలు అవేం భాగస్వామ్య పక్షాలంటూ ఎద్దేవా చేశారు.