IPL 2025: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. జట్టులో ఊహించని ప్లేయర్లు

by Mahesh |   ( Updated:2025-03-23 09:37:17.0  )
IPL 2025: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. జట్టులో ఊహించని ప్లేయర్లు
X

దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా టోర్నీ ఐపీఎల్ (IPL) 2025 శనివారం సాయంత్రం కోల్ కత్తా వేదికగా ప్రారంభం అయింది. మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీ, కేకేఆర్ తలపడ్డాయి. కాగా ఈ రోజు ఆదివారం కావడంతో డబుల్ డెక్కర్ మ్యాచులు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్ల మధ్య జరుగుతుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఇదిలా ఉంటే ఐపీఎల్ మెగా వేలం తర్వాత జట్టులో ఏ ఏ ప్లేయర్లకు అవకాశం దక్కుతుందోనని SRH అభిమానులు ఆత్రుతగా ఎదురు చూడగా.. తుది జట్టులో యువ ప్లేయర్లతో పాటు డేంజరస్ బ్యాటర్లకు మరోసారి అవకాశం దక్కింది. కాగా ఈ రెండు జట్ల మధ్య గత సీజన్‌లో ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా జరిగిన మ్యాచ్.. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఆ మ్యాచులో SRH జట్టు రాజస్థాన్ పై చివరి బంతికి 1 పరుగు తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రాజస్థాన్ జట్టు ఈ సీజన్ లో పూర్తిగా యువ ప్లేయర్లతో నిండిపోయింది. బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్లు ఉండటంతో.. నేడు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ హై ఓల్టేజ్ లో జరగనుంది. మరీ ఈ మ్యాచులో హైదరాబాద్ ప్లేయర్లు ఏ రేంజ్ ఫామ్ కొనసాగిస్తారో తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు వేచి చూడాల్సిందే.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(w), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(c), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ

Next Story

Most Viewed