మహిళా రిజర్వేషన్లపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో కొత్త డిమాండ్

by Satheesh |   ( Updated:2023-09-19 13:54:25.0  )
మహిళా రిజర్వేషన్లపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో కొత్త డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చట్టసభల్లో మహిళలకు కల్పించిన 33 శాతం రిజర్వేషన్లలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా బిల్లును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసమే బీజేపి 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిందన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన 50 శాతానికి పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story