ఎంపీ ఎన్నికల వేళ కేసీఆర్ టేబుల్ పై కీలక పుస్తకాలు

by Prasad Jukanti |
ఎంపీ ఎన్నికల వేళ కేసీఆర్ టేబుల్ పై కీలక పుస్తకాలు
X

దిశ,డైనమిక్ బ్యూరో:తెలంగాణంలో ఎంపీ ఎన్నికల రాజకీయం రంజుగా మారింది. పార్టీల మధ్య డైలాగ్ వార్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు ప్రధాన పార్టీలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న వేళ గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ టేబుల్ పై కొత్త పుస్తకాలు హాట్ టాపిక్ గా మారాయి. జాన్ సి. మాక్స్‌వెల్ రాసిన 'ది 21 ఇర్రెపుటబుల్ లాస్ ఆఫ్ లీడర్‌షిప్', హెక్టర్ గ్రాసియా, ఫ్రాన్సెస్ మిరాల్ రచించింన ఇకిగాయ్ (ఆనందమయమైన చిరాయుషుకు జపనీయుల రహస్యం) తెలుగు అనువాదం పుస్తకం ఆయన టేబుల్ పై దర్శనం ఇచ్చాయి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కొంత మంది పార్టీ లీడర్లు కేసీఆర్ ను కలిసిన సందర్భంగా తీసుకున్న ఫోటోలలో ఈ పుస్తకాలు కనిపించాయి. ప్రస్తుతం పార్టీలో వలసల కలకలం చెలరేగింది. మరోవైపు కూతురు కవిత అరెస్ట్ అయి జైలులో ఉన్న నేపథ్యంలో లీడర్ షిప్ పై పుస్తక పఠం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

నిజానికి కేసీఆర్ పుస్తకపఠనంపై రాజకీయ వర్గాల్లో నిత్యం చర్చ జరుగుతూ ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా ఆయన ప్రముఖుల పుస్తకాలు తిరిగేస్తుంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తాను రాజకీయంగా ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? ఏయే అంశాలపై దాడి చేయబోతున్నారో దానికంటే ముందు అధ్యయనం చేయడం కేసీఆర్ కు అలవాటు అని చెబుతుంటారు. ఈ క్రమంలో ఆయన ఎవరైనా నేతలు కేసీఆర్ ను కలిసినప్పుడు దిగిన ఫోటోలలో కనిపించే పుస్తకాల ఆధారంగా కేసీఆర్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారో అనేది సోషల్ మీడియాలో చర్చగా మారుతుంటుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక తుంటి మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ ఆసుపత్రిలో విశ్రాంతి సమయంలో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని బుక్స్‌ను తెప్పించుకుని వాటిని అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రఖ్యాత ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్ సినాప్సిస్‌ను కేసీఆర్ చదవటం కనిపించింది. భారత్- చైనా ఆర్థిక వ్యవస్థపై రచించిన బుక్ ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్. బ్రిటీష్ ఎకనమిస్ట్ డేవిడ్ హెన్రీ స్మిత్ దీన్ని రాశారు. ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక తేడాలను వివరించారు.

Advertisement

Next Story

Most Viewed