- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సదస్సు!
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతోంది. డిసెంబర్ 12 నుంచి నోవాటెల్ హెచ్ఐసీసీలో ది ఇండస్ ఆంత్రప్రెన్యూర్స్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు పలు దేశాలకు చెందిన 2,500 మంది ప్రతినిధులు, 17 దేశాలకు చెందిన 550 మందికి పైగా టీఐఈ చార్టర్ మెంబర్స్, 150 మందికి పైగా గ్లోబల్ స్పీకర్స్, 200 మందికి పైగా పెట్టుబడిదారులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ, గోయెంకా గ్రూప్ సీఈవో, ఎంపీ అనిల్ కుమార్ చలమశెట్టి తదితరులు ఈ సమ్మిట్ లో పాల్గొననున్నారు. విభిన్న రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు తమ ఆలోచనలు పంచుకోవడానికి టీజీఎస్ -22 వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.