Moinabad farmhouse case: ఫాంహౌస్ నిందితుడు రామచంద్ర భారతిపై మరో కేసు

by Nagaya |   ( Updated:2022-11-23 13:36:12.0  )
Moinabad farmhouse case: ఫాంహౌస్ నిందితుడు రామచంద్ర భారతిపై మరో కేసు
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ ఎమ్మె్ల్యేల కోనుగోలు కేసులో నిందితుడైన రామచంద్ర భారతిపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. సిట్ అధికారులు విచారణ చేస్తున్న సమయంలో రామచంద్ర భారతి ఐఫోన్, ల్యాప్‌టాప్‌లో నకిలీ పాస్ పోర్టుకు సంబంధించిన వివరాలను గుర్తించారు. రామచంద్ర భారతి పేరు కాకుండా, భరత్ కుమార్ శర్మ అనే పేరుతో పాస్ పోర్టును గుర్తించారు. కర్నాటకలోని పుత్తూరు అడ్రస్‌తో ఈ పాస్ పోర్టు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారి గంగాధర్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ, చీటింగ్ తో పాటు పాస్ పోర్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. పాస్‌పోర్ట్ యాక్ట్ చాలా తీవ్రమైన నేరం కాబట్టి రామచంద్ర భారతిని మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story