- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: కేటీఆర్ కు మరో బిగ్ షాక్.. తనతో పాటు పీఏ, క్రిశాంక్ పై పోలీసు కేసు
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. కేటీఆర్ తో పాటు ఆయన పీఏ తిరుపతి, బీఆర్ఎస్ నేత క్రిశాంక్, బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగంపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద బ్యూటీఫికేషన్ లో భాగంగా జీహెచ్ఎంసీ అబేంద్కర్ విగ్రహం చుట్టూ గోడ కడుతుంటే అంబేద్కర్ ను అవమానిస్తోందని దళితులను రెచ్చగొట్టేలా పోస్టులు చేశారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గోడను కూల్చేందుకు వీరు పోస్టుల్లో రెచ్చగొట్టే వైఖరినే కారమం అని అందువల్ల వీరిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ ప్రీతం, టీఎస్ ఎండీసీ చైర్మన్ ఇరవర్తి అనిల్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్న మెట్టు సాయి కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ లు హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై క్రిశాంక్ స్పందించారు. కేవలం అంబేద్కర్ విగ్రహం ముందు గోడ నిర్మాణం పై మాట్లాడితేనే కేసులా అని ప్రశ్నించారు. అసలు కేటీఆర్, అతని పీఏ ఏం నేరం చేశారని నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఇంకా అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.