BRS party : నాంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆనంద్ కుమార్

by Mahesh |   ( Updated:2023-11-07 13:17:50.0  )
BRS party : నాంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆనంద్ కుమార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గోషామహల్, నాంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరు అనే సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పడింది. గోషామహల్ టికెట్ నందకిషోర్ వ్యాస్ కు, నాంపల్లి టికెట్ ఆనంద్ కుమార్ గౌడ్ ను కేటాయిస్తు గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ వీరికి బీ ఫామ్ లు అందజేశారు. గోషామహల్ లో బీజేపీ తరఫున రాజాసింగ్ పోటీ చేస్తుండటంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనేది కొంత కాలంగా చర్చ జరుగుతున్నది. ఈ సెగ్మెంట్ లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న గులాబీ పార్టీ నందకుమార్ వ్యాస్ ను బరిలోకి దింపుతోంది.

Advertisement

Next Story

Most Viewed