- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యక్తిగత డేటా చోరీ కేసులో కీలక పరిణామం
దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతవారం వెలుగు చూసిన ఈ వ్యవహారంలో ఈడీ ఎంటర్ అయింది. 16.8 కోట్ల మంది పర్సనల్ డేటా లీక్ అయినట్లు ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
ఈ మేరకు తాజాగా డేటా లీక్‌పై సైబరాబాద్ పోలీసుల నుంచి ఈడీ సమాచారం కోరింది, ఇందులో రక్షణ విభాగంలో పని చేసే ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలకు చెందిన రహస్య సమాచారమంతా చోటీకి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మనీలాండరింగ్ ఏదైనా జరిగిందా అనేకోణంలో ఈడీ దర్యాప్తును కొనసాగిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అనేక సంచలనాలు వెగులు చూస్తుండగా దర్యాప్తు ముందుకు సాగుతున్న క్రమంలో ఎలాంటి సెన్సేషన్స్ బయటపడతాయనేది ఉత్కంఠగా మారింది.