'అమానుషం.. బహిరంగంగా స్థంబానికి కట్టేసి కొట్టిండ్రు'

by GSrikanth |
అమానుషం.. బహిరంగంగా స్థంబానికి కట్టేసి కొట్టిండ్రు
X

దిశ, వెబ్‌డెస్క్: జోగులాంబ గద్వాల జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. చేనులోని పందులు వచ్చాయని ఎస్టీలను స్తంభానికి కట్టేసి కొట్టడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై BSP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ''గద్వాల జిల్లాలో తమ చేల్లోకి పందులు పడ్డాయని ఎరుకల(ST) అన్నలను గ్రామంలో బహిరంగంగా స్థంబానికి కట్టేసి కొట్టిండ్రు. #KCR పాలనలో పేదప్రజలకు రక్షణ లేదు. ఈ అమానుష దాడికి పాల్పడ్డ వారికి ధైర్యం ఎవరిస్తున్నరు? ఎక్కుడున్నయి శాంతిభద్రతలు? ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్లను ఇట్లనే చేస్తరా?'' అంటూ సోషల్ మీడియా వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story