పీవీ సింధుతో భేటీపై అమిత్ షా ట్వీట్

by Javid Pasha |   ( Updated:2023-09-16 17:31:46.0  )
పీవీ సింధుతో భేటీపై అమిత్ షా ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను హైదరాబాద్‌లో ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కలిశారు. పీవీ సింధు వెంట ఆమె తండ్రితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. మర్యాదపూర్వకంగానే అమిత్ షాను పీవీ సింధు కలిసినట్లు తెలుస్తోంది. పీవీ సింధుతో భేటీపై అమిత్ షా ట్వీట్ చేశారు. పీవీ సింధు అద్బుతమైన క్రీడాకారిణి అని, తన అసాధారణమైన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించేలా చేశారని ప్రశంసించారు.

పీవీ సింధు చేసిన కృషి, అంకితభావం యువతకు స్పూర్తిగా నిలుస్తుందని అమిత్ షా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఎన్నికల క్రమంలో అమిత్ షాతో పీవీ సింధు భేటీ చర్చనీయాంశంగా మారింది. పీవీ సింధుతో భేటీ వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనే ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె ఏమైనా ప్రచారం చేస్తుందా? అనే చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed