ప్రభుత్వ మారితే ఆధారాలు, పేపర్లు మారవు.. హైడ్రా నోటీసులపై అమర్ సొసైటీ సభ్యుల వ్యాఖ్యలు

by Mahesh |   ( Updated:2024-08-31 13:13:35.0  )
ప్రభుత్వ మారితే ఆధారాలు, పేపర్లు మారవు.. హైడ్రా నోటీసులపై అమర్ సొసైటీ సభ్యుల వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజుల క్రితం దుర్గం చెరువును ఆనుకుని ఉన్న పలు కాలనీలతో పాటు సొసైటీలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇందులో కావూరి హిల్స్, సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని నెల రోజుల్లో అక్రమ కట్టడాలు అన్ని కూల్చేయాలని నోటీసుల్లో నోటీసుల్లో పేర్కొంది. కాగా హైడ్రా నోటీసులపై అమర్ సొసైటీ సభ్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ అమర్ సొసైటీలో ఇళ్లను కట్టుకున్న తమకు నోటీసులు జారీ చేశారు. అందులో 30 రోజుల్లో ఇళ్లను ఖాళీ చేయాలని తెలిపారన్నారు. 1991లో లే అవుట్ అప్రూవ్ చేశారు. అన్ని అనుమతులు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నామని... ఆ సమయంలోనే తమ సొసైటీ ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదని గత ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం మారితే ఆధారాలు, పేపర్లు మారవని దుర్గం చెరువు అమర్ సొసైటీ సభ్యులు చెప్పుకొచ్చారు. అలాగే ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ను కూల్చి వేస్తారా అని ఈ సందర్భంగా అమర్ సొసైటీ సభ్యులు హైడ్రాను, ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed