Allam Narayana: ఫిల్మ్ ఛాంబర్ ఎదుట జర్నలిస్టుల ఆందోళన.. అల్లం నారాయణ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-12-11 07:29:14.0  )
Allam Narayana: ఫిల్మ్ ఛాంబర్ ఎదుట జర్నలిస్టుల ఆందోళన.. అల్లం నారాయణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మీడియా ప్రతినిధి రంజిత్‌ (Ranjith)పై నటుడు మోహన్ బాబు (Mohan Babu) దాడి ఘటనను జర్నలిస్ట్ సంఘాల (Journalist Unions) తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ఇవాళ ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber) ఎదుట సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్ (Devulapally Amar), అల్లం నారాయణ (Allam Narayana) కలిసి భారీ ఎత్తున జర్నలిస్టులు నల్ల బ్యాడ్జిలు ధరించి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ (Allam Narayana) మాట్లాడుతూ.. జర్నలిస్టుపై దాడికి పాల్పడిన మోహన్ బాబు (Mohan Babu)పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనపై వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాలని అన్నారు.

మోహన్ బాబు జర్నలిస్టుపై ఓ ఉన్మాదిలా దాడి చేశారని ఫైర్ అయ్యారు. ఒక రౌడీలా రంజిత్‌ (Ranjith)పై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు మోహన్ బాబు (Mohan Babu) ఇంకా క్షమాపణలు చెప్పలేదని అన్నారు. వాళ్ల కుటుంబ సమస్య బజారున పడ్డాక.. కేసులు నమోదైన తరువాతే మీడియా జోక్యం చేసుకుందని తెలిపారు. మీడియా (Media)పై నిన్న జరిగింది ముమ్మటికీ క్రూరమైన దాడేనని అన్నారు. మోహన్ బాబుపై వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని అల్లం నారాయణ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed