Bhatti Vikramarka : అన్ని వసతిగృహ, హాస్టల్స్ విద్యార్థుల డైట్, కాస్మొటిక్ చార్జీల పెంపు జీవో విడుదల

by M.Rajitha |   ( Updated:2024-11-03 12:51:26.0  )
Bhatti Vikramarka : అన్ని వసతిగృహ, హాస్టల్స్ విద్యార్థుల డైట్, కాస్మొటిక్ చార్జీల పెంపు జీవో విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలు, పలు సంక్షేమ హాస్టళ్లు, వసతి గృహాల్లోని విద్యార్థులకు మేలు చేకూరేలా కాస్మోటిక్స్, డైట్ చార్జీలను పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ పెంపుకు సంబంధించిన జీవోను ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) విడుదల చేశారు. కాగా ప్రస్తుతం 3 నుంచి 7వ తరగతి వరకు ఉన్న డైట్ ఛార్జీలు రూ.950గా ఉన్న డైట్ ఛార్జీలు రూ.1330కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకు.. రూ.1100 నుంచి రూ.1540కి పెంచారు. ఇక ఇంటర్ నుండి పీజీ వరకు.. రూ.1500 నుంచి రూ.2100కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కాస్మోటిక్ ఛార్జీలు 3 నుంచి 7వ తరగతి వరకు ప్రస్తుతం రూ.55 ఉండగా.. దానిని రూ.175కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకు రూ.75 నుంచి రూ.275 వరకు పెంచారు. 40 శాతం పెరిగిన ఈ ఛార్జీల వలన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ వివరాలకు సంబంధించిన జీవో కాపీని నేడు అధికారికంగా విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed