- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు చేశారు మీరెప్పుడు చేస్తారు?.. రేవంత్ రెడ్డిపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా వృద్ధాప్య పింఛన్లను నాలుగు వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చడం లేదని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఐదు హామీలపై అక్కడి సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేశారని మరి తెలంగాణలో పించన్లను రూ.4 వేలకు ఎప్పుడు పెంచుతారని ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీ మీడియాతో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి.. కేసీఆర్ పేరు ఉందనే నెపంతో పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవడం సరికాదని, దీని వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని ధ్వజమెత్తారు. పుస్తకాలను యథావిధిగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల్లో బీజేపీ పట్ల విశ్వాసం పెరుగుతోందని రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. కుంభకోణాలు జరిగినప్పుడు ఈడీ దర్యాప్తు చేయడం సహజం అన్నారు.
Also Read...
ఈ బాలికలను చూస్తుంటే సంతోషంగా ఉంది..సీఎం రేవంత్ ట్వీట్ వైరల్!