విద్యార్థులకు అలెర్ట్ : EAMCET ఇకనుంచి EAPCET.. పరీక్ష తేదీలు ఇవే

by Prasanna |   ( Updated:2024-01-26 04:56:39.0  )
విద్యార్థులకు అలెర్ట్ : EAMCET ఇకనుంచి EAPCET.. పరీక్ష తేదీలు ఇవే
X

దిశ, ఫీచర్స్ : రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న EAMCET ఇకపై EAPCET (ఎప్‌సెట్‌) గా పిలువబడుతుంది. మెడికల్ ప్రవేశాలను ఎంసెట్ నుంచి తొలగించి నీట్‌ ద్వారా ఆ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి దాని పేరును ఎప్‌సెట్‌గా మార్చారు. అంటే, “టెక్నాలజీ, అగ్రికల్చర్, ఫార్మసీ” సెట్ ను - EAPCET గా మార్చబడింది.ఇక్కడ మెడికల్ స్థానంలో ఫార్మసీని చేర్చారు. ఇది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ సెట్‌గా మారిపోయింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం జీవో జారీ చేశారు.

రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ నిర్వహించిన ఎప్‌సెట్‌ పరీక్షతో సహా మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్షలు మే 9 నుంచి 13 వరకు జరుగుతాయి. మొదటి మూడు రోజులు ఇంజినీరింగ్‌, చివరి రెండు రోజులు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి సంబందించిన పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య ఆర్ లింబాద్రి, బుర్రా వెంకటేశం తదితరులు పరీక్ష తేదీలను ప్రకటించారు.

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే..?

పరీక్ష నిర్వహించే యూనివర్సిటీల్లో ఎలాంటి మార్పులు లేవు. అయితే, ఈ సారి ఏడు పరీక్షలు జరుగుతాయి. మే లో 3 , జూన్‌లో 4 పరీక్షలు నిర్వహించనున్నారు. ECET, APCET మరియు EDCET పరీక్షలు మేలో జరుగుతాయి. LAWCET, ICET, PG ECET మరియు PECETపరీక్షలు జూన్‌లో జరుగుతాయి. అయితే ఫిబ్రవరి నెలాఖరు నుంచి నిర్ణయాలు తీసుకోనున్నారు. APCET దరఖాస్తుల స్వీకరణ మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతుంది.

పరీక్ష తేదీలు

TS EAPCET – మే 9 నుంచి మే 13

TS LAWCET – జూన్ 3

TS ICET – జూన్ 4 , 5

TS PG ECET – జూన్ 6 నుంచి జూన్ 8

TS PECET – జూన్ 10 నుంచి జూన్ 13

Advertisement

Next Story

Most Viewed

    null