విద్యార్థులకు అలర్ట్ : రెండు రాష్ట్రాల్లో నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్

by Rajesh |
విద్యార్థులకు అలర్ట్ : రెండు రాష్ట్రాల్లో నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇరు రాష్ట్రాల్లో సుమారు 11.5 లక్షల మంది స్టూడెంట్స్ పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లో ఎస్ ఎస్ సీ బోర్డులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులను ఎగ్జామ్ సెంటర్ల వద్ద మోహరించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు పకడ్బంధీగా జరగనున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా 11,456 పాఠశాలలకు చెందిన 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పదో తరగతి స్టూడెంట్స్ కోసం స్టేట్ లో 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగనున్నది. చివరి నిమిషంలో వచ్చే విద్యార్థుల కోసం ఐదు నిమిషాలు అదనపు సమయం కేటాయించారు. 9:35 గంటలకు గేట్లు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థలు హాల్ టికెట్లు చూయిస్తే ఉచితం ప్రయాణించేలా ఆర్టీసీ చర్యలు తీసుకుంది.

ఏపీలో ఇలా..

ఏపీలో ఈ రోజు నుంచి 18 వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి. స్టేట్ లో మొత్తం 3,449 పరీక్షా కేంద్రాల్లో 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఆయా ప్రాంతాలలో పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల్లో 156 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసి అధికారులతో సమన్వయం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. పదో తరగతి విద్యార్థుల కోసం అదనపు ఆర్టీసీ బస్సులు నడిపించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed