- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందుబాబులకు అలర్ట్.. తెలంగాణలో కొత్త బ్రాండ్లపై మంత్రి క్లారిటీ
దిశ, డైనమిక్ బ్యూరో:
రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని, మేము పరిశీలించలేదని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జూపల్లి.. గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్ పెట్టిందని.. పెండింగ్ బిల్లుల వల్లే కంపెనీలు ఎక్కడైనా బీర్లు సప్లై చేయకపోయి ఉండవచ్చు తప్ప కృత్రిమ కొరత అనేది లేదన్నారు. పొరుగు రాష్ట్రంలో చేసినట్లుగా తెలంగాణలో కూడా కొన్ని కొత్త బ్రాండ్లు పరిచయం చేసి వాటి ద్వారా భారీగా కమీషన్లు పొందేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు అనధికారికంగా కొత్త మద్యం పాలసీని రూపొందించారని, ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త తరహా మద్యం దందా ప్రారంభం కాబోతున్నదని ఓ దినపత్రిక (దిశ కాదు) వెలువరించిన కథనాన్ని మంత్రి ఖండించారు. అసత్యాలు ప్రచురించిన సదరు పత్రికపై డిపార్ట్మెంట్ ద్వారా రూ.100 కోట్ల పరువు దావా వేయబోతున్నట్లు చెప్పారు.
దొంగే దొంగ అన్నట్లుంది:
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాలు పెట్టిందని ఈ పెండింగ్ బకాయిలకు బాధ్యులు ఎవరని మంత్రి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల మాటలు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిస్తోందన్న ఆరోపణలపై స్పందిస్తూ.. మద్యం కొరత ఉంటే ప్రభుత్వానికే నష్టం తప్ప ప్రజలకు కాదన్నారు. బ్లాకులో అమ్మిన ఘటనలపై ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసిందని, రాష్ట్ర ఆదాయనికి గండి పడకుండా పగడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. తాము వచ్చాక ప్రతి లిక్కర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి మానిటరింగ్ కమిషనర్, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగాయా అని ప్రశ్నించారు. గడిచిన ఎనిమిదేళ్లుగా ఎక్సైజ్ శాఖలో కొంత మంది అధికారులు తిష్టవేసుకుని కూర్చున్నారని వీరిలో కొందరిని ట్రాన్స్ ఫర్ చేశామన్నారు. గతంలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప బదిలీలు జరిగేవి కావని ఇప్పుడు పైరవీలు, ముడుపులు లేకుండా పోర్టర్ ద్వారా జరుగుతున్నాయన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు.
స్టాక్ ఎక్కడుందో తెలుసుకునే మెకానిజం:
మద్యం సరఫరాల్లో బ్లాక్ మార్కెటింగ్ ను పటిష్టంగా నివారిస్తున్నామని, టానిక్ లకు గత ప్రభుత్వం ఇచ్చిన పన్ను మినహాయింపును రద్దు చేశామన్నారు. హోలో గ్రామ్ లను గడిచిన పదేళ్లు బీఆర్ఎస్ సర్కార్ టెండర్లు లేకుండా ఒక వ్యక్తికే ఇచ్చిందని దానిని తాము డూప్లికేషన్ లు, బోగస్ లేకుండా బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అవలంబిస్తున్న విధానంలో జరిగేలా టెండర్లు పిలుస్తామన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ వస్తున్నామన్నారు. వైన్స్, బార్లులకు వచ్చే స్టాక్ ను వెరిఫై చేసేలా ఎన్ని బాటిల్స్ వస్తున్నాయి? ఎన్ని బాటిల్స్ వెళ్తున్నాయనేది తెలుసుకునేందుకు మెకానిజం ఏర్పాటు చేయడం కోసం అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం ఏముందో వెతుకుతున్నామన్నారు.