- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అలర్ట్ : ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్.. ట్రాఫిక్ మళ్లింపు ఇలా!
దిశ, వెబ్‌డెస్క్: రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. అయితే ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ప్రగతి భవన్ నుంచి నేరుగా సీఎం ఎల్బీ స్టేడియం వెళ్లనున్నారు. కేసీఆర్ పర్యటన దృష్ట్యా ఎల్జీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఇఫ్తార్ విందు సందర్భంగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
నాంపల్లి చాపెల్ రోడ్డు నుంచి బీజేపీ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏ ఆర్ పెట్రోల్ పంపు వద్ద పీసీఆర్ వైపు మళ్లిస్తారు. ఎస్ బీఐ గన్ ఫౌండ్రీ నుంచి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, బషీర్ బాగ్ ఫ్లై ఓవర్ వైపు వచ్చే ట్రాఫిక్ ను ఎస్ బీఐ గన్ ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్డు వైపు మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే వాహనాలను రవీంద్రభారతి, హిల్ ఫోర్ట్ రోడ్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు ఫతే మైదాన్ లోని కేఎల్ కే బిల్డింగ్ వద్ద సుజాత హై స్కూల్ వైపు మళ్లిస్తారు.
బషీర్ బాగ్ ఫ్లై ఓవర్ పై వచ్చే ట్రాఫిక్ ను బీజేఆర్ విగ్రహం వద్ద కుడి మలుపు తీసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నారాయణ గూడ స్మశాన వాటిక వైపు నుంచి వచ్చే వాహనదారులను పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద హిమాయత్ నగర్ జంక్షన్ వైపు మళ్లిస్తారు. కింగ్ కోఠి, బొగ్గుల కుంట నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్ బాగ్ కు వచ్చే ట్రాఫిక్ ను కింగ్ కోఠి కూడలిలోని తాజ్ మహల్, ఈడెన్ గార్డెన్ వైపు మళ్లిస్తారు. బషీర్ బాగ్ నుంచి పీసీఆర్ వైపు వచ్చే ట్రాఫిక్ ను బషీర్ బాగ్ వద్ద లిబర్టీ వైపు మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కోరారు.