- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mutual Transfers: వారెవ్వా టీచర్ల దందా..! మ్యూచువల్ బదిలీల్లో కరెన్సీ కట్టల జోరు
దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయుల మ్యూచువల్ బదిలీల్లో డబ్బుల ప్రవాహం జోరుగా కొనసాగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లోని పోస్టులకు లక్షల్లో డిమాండ్ నెలకొన్నది. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు గరిష్టంగా రూ.20 లక్షల ధర పలికినట్లు సమాచారం.రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాల్లోని పోస్టులకు సైతం తక్కువలో తక్కువ రూ.15 లక్షలు ఇచ్చేందుకు టీచర్లు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. జీవో 317 కింద నష్టపోయిన టీచర్లకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మ్యూచువల్ బదిలీలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో డిసెంబరు 31 వరకు ధరఖాస్తులు తీసుకున్నది. పరస్పర బదిలీల్లో సిటీ, జిల్లా కేంద్రాల సమీప ప్రాంతాల్లోని స్కూల్స్‌కు ట్రాన్స్‌ఫర్ల బదిలీల కోసం రూ.లక్షల్లో డబ్బులు వెచ్చించేందుకు సిద్దమైనట్లు ప్రచారం ఉంది.
అర్బన్‌కు దగ్గరయ్యేందుకు ప్రయారిటీ..
జీవో 317 వలన నష్టపోయిన టీచర్లకు ఉపశపనం కలిగించేందుకు ప్రభుత్వం స్పౌజ్, అనారోగ్యం, పరస్పర బదిలీలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు డిసెంబరు 31 వరకు దరఖాస్తులు తీసుకున్నారు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోరుకుంటోన్న టీచర్లు అర్బన్ ఏరియాకు, సమీప ప్రాంతాల్లోని స్కూల్స్‌కు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకు లక్షల్లో ముట్టచెప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా గ్రేటర్ చుట్టున్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి(భారతీనగర్, పటాన్ చెరువు, రామచంద్రపురం ప్రాంతాలు) స్కూల్స్‌కు బదిలీపై వచ్చేందుకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. అలాగే ఉమ్మడి జిల్లా కేంద్రాలైన నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా కేంద్రాల కోసం రూ.15 లక్షలు, రిమోట్ ఏరియా నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లాల కేంద్రాలకు వచ్చేందుకు రూ.7 లక్షలు ఇస్తున్నట్లు ప్రచారం సాగుతున్నది. సౌకర్యవంతమైన జీవితం, పిల్లల ఉన్నత చదవులు, కుటుంబాలకు దగ్గరగా ఉండొచ్చని ప్రధాన కారణాలతో టీచర్లు అర్చన్ ప్రాంతాలకు బదిలీల కోసం ఎత్తున డబ్బులు చెల్లిస్తున్నట్టు తెలుస్తున్నది.
బాండ్ పేపర్లపై సంతకాలు..
పరస్పర బదిలీల్లో మరొకరి అంగీకారం తప్పనిసరి. అలాగే, ఇద్దరు టీచర్లలో ఒకరు జీవో 317 కింద బాధితులుగా ఉండాలి. అప్పుడే పరస్పర బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇస్తున్నది. మ్యూచువల్ బదిలీల్లో దరఖాస్తు చేసుకున్న టీచర్లకు బాండ్ పేపర్లు కీలకంగా మారాయి. మారుమూల ప్రాంతాలకు వెళ్లే టీచర్‌కు ఇచ్చే అమౌంట్‌ను ప్రధానంగా అందులో పేర్కొంటున్నారు. డబ్బులు చెల్లింపుల్లో ఇరువురి మధ్య ఎలాంటి తగాదాలు రాకుండా మధ్యవర్తులకు కొందరు టీచర్లు సాక్షులుగా సంతకాలు చేసినట్లు టాక్ ఉంది. కొన్ని జిల్లా కేంద్రాల్లో టీచర్ సంఘాల లీడర్లే మధ్యవర్తులుగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరో ఏడాది నుంచి రెండు, మూడేళ్లలో రిటైర్ట్ అయ్యే టీచర్లే రిమోట్ ప్రాంతాలకు బదిలీ అయ్యేందుకు చొరవ చూపారు. అదనపు ఆదాయం వస్తుందని ఆశతోనే మ్యూచువల్‌కు రెడీ అయినట్లు చర్చ జరుగుతున్నది.
సంక్రాంతి తర్వాతే బదిలీలు..
మ్యూచువల్ బదిలీలను నేరుగా సెక్రెటేరియట్‌లోని జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) పర్యవేక్షణ చేస్తున్నది. ఆన్‌లైన్‌లో వచ్చిన అప్లికేషన్లను ఆ శాఖనే స్క్రూట్నీ చేసి, సంబంధిత శాఖలకు పంపనుంది. మ్యూచువల్ బదిలీల కోసం టీచర్ల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు సచివాలయం వర్గాలు తెలిపాయి. రూల్స్ ప్రకారం వచ్చిన అప్లికేషన్లను పరిశీలించాకే వాటిని క్లియర్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. సంక్రాంతి సెలవుల తర్వాత మ్యూచువల్ బదిలీల ఆర్డర్స్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.