'ఎవరు అడిగారని ఎయిర్ పోర్టుకు మెట్రో?'

by samatah |
ఎవరు అడిగారని ఎయిర్ పోర్టుకు మెట్రో?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ వరకు రెండో దశ మెట్రో రైలు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సోషల్ డెమొక్రటిక్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టుకి మెట్రో కావాలి అని ఎవరైనా అడిగారా? అని ప్రశ్నించారు. వెయ్యి కోట్లు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులే ఉపయోగించి ఈ ప్రాజెక్టును నిర్మించే బదులు లక్షల మంది బడి పిల్లలకు కావాల్సిన తరగతి గదులు ఎందుకు నిర్మించరని నిలదీశారు.

శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన చిన్న రోడ్డు జంక్షన్‌లలో పెద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు కట్టమని ఎవరైనా అడిగారా? ఎవరు అడగక ముందే సీఎం ఎందుకు పెద్ద ప్రాజెక్టులు తీసుకుంటారో తెలుసా? అంటూ నెటిజన్లకు ప్రశ్నను సంధించారు. మెట్రో సెకండ్ ఫేజ్ శంకుస్థాపన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దిన పత్రికలకు ఇచ్చిన ప్రకటనకు సంబంధించిన ఫోటోనూ ట్విట్టర్ లో షేర్ చేశారు. అయితే 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మితం అవుతున్న దేశంలోనే మొట్టమొదటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇది అని, కేవలం ఎయిర్ పోర్ట్ కు వెళ్లే ప్రయాణికులకే కాకుండా హైదరాబాద్ అర్బన్, సబ్ అర్భన్ ప్రాంతాల్లో మరింతగా మెరుగైన రవాణా వ్యవస్థను అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించాలనే సర్కార్ నిర్ణయంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed