- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పేదలకు విద్యను దూరం చేయడమే కేసీఆర్ పని’
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి విద్యార్థులకు పరిశోధక విద్య నుంచి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తోందని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెడీ ఫీజు ఒక్కసారే పదిరేట్లు పెంచారని ఇలా చేయడం వల్ల పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. ఇంతలా ఫీజు పెంచడం అంటే పేద విద్యార్థులను పీహెచ్ డీ చేయొద్దనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని గురువారం ట్వీట్ చేశారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు పూర్తిగా ధ్వంసం చేసిన ప్రభుత్వం తాజా నిర్ణయం ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వ విద్యను ధ్వంసం చేయడంలో మరో పావు కదిపిందని ఆరోపించారు.
రూ. 2 వేలు ఉన్న పీహెచ్ డీ ఫీజును రూ.20 వేలకు పెంచడం ఏంటని ప్రశ్నించారు. పేదోళ్ల ఎప్పడికి పేదవారిగానే ఉండాలా అని ఈ సందర్భంగా నిలదీశారు. కాగా ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ ఫీజు పెంపుపై విద్యార్థులు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలను తలదన్నేలా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ట్యూషన్ ఫీజులు పెంచడం వల్ల విద్యార్థులు ఆర్థికంగా మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారని మండిపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో Phd ఫీజు ఒక్కసారే పది రెట్లు పెంచిన్రు
— Murali Akunuri (@Murali_IASretd) May 25, 2023
అంటే పేద విద్యార్థులు Phd చెయ్యొద్దు అనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం. పేదోళ్లకు అందే ప్రభుత్వ విద్యను ధ్వంసం చెయ్యడం లో BRS ప్రభుత్వం ఇంకో పావు కదిపింది.
బడులు కాలేజీలు ఇప్పటికే పూర్తి ధ్వంసం
పేదోళ్లు ఎప్పటికి పేదగానే ఉండాలా pic.twitter.com/lbXoLOclC2