బీఆర్ఎస్ MP Santosh Raoకు షాక్!

by GSrikanth |   ( Updated:2023-01-02 08:56:22.0  )
బీఆర్ఎస్ MP Santosh Raoకు షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హరితహారం పేరుతో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు ప్రభుత్వ సొమ్మును స్వాహా చేస్తున్నాడని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఏఐసీసీ మెంబర్ బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. సోమవారం ఢిల్లీలోని ఈడీ డైరెక్టర్ ను కలిసి హరితహారం నిధులు మళ్లింపు, ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు అక్రమాలపై ఫిర్యాదు చేసినట్టు బక్క జడ్సన్ తెలిపారు. ఫిర్యాదు చేసిన అనంతరం ఓ వీడియోను విడుదల చేసిన జడ్సన్ మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమం పెద్ద కుంభకోణం అని ఇందులో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని అన్నారు. సంతోష్ రావు హరితహారం పేరుతో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేస్తున్నాడని ఆరోపించారు. 2015లో సీఎం కేసీఆర్ చిలుకూరు బాలాజీ టెంపుల్ లో రూ. 550 కోట్లతో హరిత హారం కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించగా సంతోష్ రావు తెలివిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో చెట్లను నాటించి సెల్ఫీలు తీసి ఫేమ్ చేసుకుంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పాడు. ఉపాధి నిధులు హరితహారం కార్యక్రమానికి మళ్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఫిర్యాదులో కోరాడు. కాగా ఇప్పటికే ఉపాధి నిధులను ఇతర పనులకు దారి మళ్లించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి హరితహారం పథకంపై వస్తున్న ఆరోపణలు రాజకీయంగా సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి. హరితహారం వెనుక రూ.1400 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని దీంట్లో ఎప్పుడూ కేసీఆర్ వెన్నంటే ఉండే సంతోష్ రావు పేరును కాంగ్రెస్ ప్రస్తావిస్తూ ఈడీకి ఫిర్యాదు చేయడం పొలిటికల్‌గా హాట్ టాపిక్ అవుతోంది.

Also Read...

గులాబీ బాస్ వ్యూహం.. బీఆర్ఎస్‌లో వారి ఆశలు గల్లంతేనా?

Advertisement

Next Story

Most Viewed