- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవిత అరెస్టు అనుమానమే ! బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం: కేఏ పాల్
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా, బీఆర్ఎస్ పార్టీపైనా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు కాకుండా బీజేపీ పెద్దలతో కేసీఆర్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని, అందువల్లనే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టయినా కవిత మాత్రం సేఫ్ అయ్యారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ-బీఆర్ఎస్ మధ్య కుదిరిన ఈ రహస్య ఒప్పందంలో భాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 35 స్థానాల్లో గులాబీ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులు బరిలోకి దిగుతారని, అది పరోక్షంగా కమలం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల గెలుపునకు కారణమవుతుందన్నారు.
ఇదే జరిగితే కేసీఆర్ ఫ్యామిలీలో ఒక షిండే పుట్టుకొస్తారని, చివరకు అది తెలంగాణ అధికారం బీజేపీ హస్తగతమవుతుందని జోస్యం చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టు తప్పదంటూ మార్చి నెల రెండో వారంలో కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె అరెస్టు అయ్యే అవకాశమే లేదని అన్నారు. నిజానికి ఆమె అరెస్టు అయ్యేదుంటే ఇప్పటికే అది జరిగి ఉండేదని, కానీ బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకుని దాన్ని కేసీఆర్ నివారించారని ఆరోపించారు.