Aghori: శంషాబాద్ లో అఘోరి.. ఆత్మహత్య చేసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు

by Rani Yarlagadda |
Aghori: శంషాబాద్ లో అఘోరి.. ఆత్మహత్య చేసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ మండలంలోని పలు దేవాలయాలను అఘోరి మాత సందర్శించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport) సమీపంలో ఉన్న హనుమాన్ దేవాలయంలోని (Hanuman Temple) నవగ్రహ విగ్రహాలను ఇటీవలే అగంతకులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ ఆలయంతో పాటు సిద్ధాంతి కట్టమైసమ్మ దేవాలయం, జూకల్ సౌడమ్మ దేవాలయాన్ని అఘోరి సందర్శించింది. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని, గో హత్యలు, మహిళలపై అత్యాచారాలు సైతం ఎక్కువయ్యాయని పేర్కొందామె. నిందితుల్ని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అఘోరి రాక విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ కాలనీ వద్ద ఆమెను అడ్డుకున్నారు. ఎక్కడెక్కడ హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయో.. అక్కడ తాను సందర్శిస్తానని, ఎవరైనా అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని అఘోరి సంచలన వ్యాఖ్యలు చేసింది.

మొదట శరీరంపై దుస్తులు లేకుండా కనిపించిన అఘోరికి.. ఓ స్వామీజీ ఎర్రటి వస్త్రాన్ని కట్టి.. అలా నగ్నంగా తిరగకూడదని చెప్పారు. యాగంటి క్షేత్రంలో (Yaganti Kshetram) దుస్తులతో కనిపించిన అఘోరీ నేడు మళ్లీ నగ్నంగా కనిపించింది. అఘోరీ అలా తిరగడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story