- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బోణి కొట్టేనా..
దిశ, ఇచ్చోడ : బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు పట్టాలు ఎక్కలేకపోతోంది. ఎవరికి వారు ఎమ్మెల్యే అభ్యర్ధి నేనంటే నేను అన్న ధోరణి, వర్గ పోరుతో గత నాలుగు దశాబ్దాలుగా వరుస ఓటములతో కంగుతింటోంది. నియోజక వర్గంలో గ్రామస్థాయి నుంచి బలమైన క్యాడర్ ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రెండవ స్థానంతోనే సరిపెట్టుకుంటోందీ. బీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజావ్యతిరేకత ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాష్ చేసుకోలేకపోతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టేనని తెలిసిన విషయమే. దీనిని ఆ పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. దీంతో కాంగ్రెస్ కు నియోజక వర్గంలో కష్టకాలం వచ్చిందని రాజకీయా విశ్లేషకులు పేర్కొంటు న్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ మంచి జోష్ వచ్చింది. కానీ బోథ్ నియోజకవర్గంలో మాత్రం అందుకు పరిస్థితి దానికి భిన్నంగా ఉంది.
నియోజక వర్గం ఏర్పాటు నుంచి..
బోథ్ నియోజక వర్గం ఏర్పాటు ఆయిన తరువాత మొదటి సారి సోషలిస్టు పార్టీ గెలుపొందింది. ఆ తరువాతి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. వరుసగా కాంగ్రెస్ పార్టీ గెలుపోందుతూ వచ్చింది. అపజయం మాటే లేకుండా కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించింది.
టీడీపీ ఏర్పాటుతో...
రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం. నందమూరి తారక రామారావు (ఎన్ఠీఆర్) 1983లో తెలుగు దేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన తరువాత 1984 నుంచి వరుసగా టీడీపీ నుంచి దివంగత మాజీ మంత్రి గోడం రామారావు రెండు సార్లు, ఆ తరువాత మరో రెండు సార్లు గోడం నగేష్ గెలుపొందారు. 2004 లో టీఆర్ఎస్, 2009 లో టీడీపీ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత టీఆర్ఎస్ వరుసగా రెండు సార్లు ప్రస్తుత ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ గెలుపొందారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓటమి పాలవుతూనే వస్తోంది. నేడు కాంగ్రెస్ పార్టీకార్యకర్తల మధ్య సఖ్యత లేకపోవడం, వర్గ పోరుకు తావు ఇవ్వడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారీబహిరంగ సభలలోనే జనాల ముందే వర్గపోరు చూపెడుతూ ఒకరి పై ఒకరు తీవ్రవిమర్శలు చేసుకుంటున్నారు.
నేనే ఎమ్మెల్యే అభ్యర్థి నంటూ ఎవరి ధీమా వారిదే..
ఈ సారి ఎన్నికల్లో నేనే.. ఎమ్మెల్యే అభ్యర్థిని, నాకే.. ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అని కొందరు నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆడే గజేందర్, వన్నెల అశోక్, నరేశ్ జాధవ్ టికెట్ కోసం ఆశీస్తున్నారు. నాకంటే నాకే టికెట్ వస్తుందంటూ ఎవరికి వారే ప్రచారం చేసుకుంటు డడంతో కార్యకర్తలు అయోమయానికి గురవు తున్నారు. వెన్నెల అశోక్ పై స్వంత పార్టీ నాయకులే విమర్శలు చేస్తున్నారు. మంచిర్యాలలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తూ, పార్టీ కార్యక్రమాలకు చుట్టపు చూపుగా వస్తున్నారని, బోథ్ కాంగ్రెస్ లో గ్రూప్ లను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంలో సరైన పట్టు లేదని పేర్కొంటు న్నారు. రైల్వే శాఖలో ఇంజనీరింగ్ ఉద్యోగం వదిలిన ఆడే గజేందర్ గత ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నియోజక వర్గంలో స్వంతగా 40 వేల మంది కార్యకర్తలతో పార్టీ సభ్యత్వం నమోదును చేయించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆడే గజేందర్ కు మాత్రం టికెట్ రాదని వన్నెల అశోక్ వర్గీయులు పేర్కొంటున్నారు.
ఎమ్మెల్యే బరిలో... నరేష్ జాదవ్ ..?
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నరేష్ జాదవ్ పేరు తెర మీదకు వచ్చింది. 2014 లో కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమీ పాలయ్యారు. 2018లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం వేరే అభ్యర్థిని ఎమ్మెల్యే భారీలో దించడంతో నరేష్ జాదవ్ నిరుత్సాహ పడ కుండా, వర్గ పోరుకు తావు ఇవ్వకుండా, అధి ష్టానం నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారనే మంచి పేరు అధిష్టానం మదిలో ఉన్నట్లు సమాచారం. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా బోథ్ లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడం లక్ష్యంగా పార్టీ కార్యకర్తలకు దిశ నిర్ధేశం చేస్తూ కృషి చేస్తున్నారు. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీతో ఉన్న పరిచయం, సన్నిహితం ఉండటంతో అధిష్టానం కూడా ఇతనిపై సుముఖతతో ఉన్నట్లు సమాచారం. నరేష్ జాధవ్ టికెట్ వస్తే వన్నెల అశోక్, ఆడే గజేందర్ వర్గీయులు గెలుపుకు కృషి చేస్తారా...అనేది సవాలక్ష ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ ఈసారి బోథ్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుతుందా..? లేక వర్గ పోరుతో మరోమారు చితికిల పడుతుందో వేచి చూడాల్సిందే.