- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపే సింగరేణి ఎన్నికలు.. మార్పు దిశగా కార్మికులు
దిశ, బెల్లంపల్లి : రేపు జరగనున్న సింగరేణి ఎన్నికలు సింగరేణి భవిష్యత్తు, కార్మికుల జీవితాలకు కీలకంగా భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడితో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో సింగరేణిలో ఎన్నికలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్ఎస్ పాలన నుంచి మార్పును ఆశించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో సింగరేణి కార్మికులు పరిస్థితిని చూసే ఉంటాం. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కంపెనీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై ప్రైవేటీకరణకు ద్వారాలు తెరిచింది. అంతేకాకుండా భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్ లను ప్రవేటుపరం చేసింది. కార్పొరేటు శక్తులకు సింగరేణి సంపదను అప్పగించింది. అదాని లాంటి పేరు మోసిన కార్పొరేట్ పెట్టుబడిదారుడికి సింగరేణిలోని బొగ్గు బ్లాకులను వేలం పేరిట కట్టబెట్టారు.
మొత్తంగా సింగరేణి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసి కార్పొరేట్ శక్తులకు గుత్త పెత్తనాన్ని అప్పగించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలoలో చేయవలసినంత చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణి సంస్థను బ్రష్టు పట్టించారు. బొగ్గు ఉత్పత్తిలో కార్మిక శక్తులు తమప్రాణాలను పణంగా పెట్టి సింగరేణి సంస్థకు సంజీవనిగా నిలిచారు. గత ప్రైవేటు కరణ అనుకూల విధానాల వల్ల సింగరేణి తిరోగమన బాట పట్టింది. బీఆర్ఎస్ పరిపాలనలో సింగరేణిలో లక్షా 16 వేల మంది కార్మికులకు గాను ప్రస్తుత 39 వేల కార్మికులు మిగిలారు. పదేళ్ల కాలంలో ఒక్క బొగ్గు గనికూడా సింగరేణి నేల పై పురుడు పోసుకున్న చరిత్ర లేదు. ఉన్న గనులు మూత పడిపోయి కొత్తగా గనులు రాక సింగరేణి నిరుద్యోగుల కార్ఖానగా మారింది. కార్మికుల రిక్రూట్మెంట్ లేకుండా పోయింది. కార్మికుల రిక్రూట్మెంట్ ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం, సింగరేణిలో కాంట్రాక్టి కరుణ, ఔట్సోర్సింగ్ ను తెరమీద తెచ్చింది.
ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికుల భవిష్యత్తు, సింగరేణి కంపెనీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ గుర్తింపు కాలంలోనే సింగరేణి సంస్థ స్వావలంబన, కార్మికులు హక్కులు కోల్పోయారు. సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయుసీ సింగరేణిలో తొలత జరిగిన ఎన్నికల్లో కార్మికులు అధికార పగ్గాలు ఇచ్చారు. ఆ సంఘం గుర్తింపు కాలంలోనే సింగరేణిలో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ మొదలైంది. అనుత్పాదక రంగాలను సైతం ప్రైవేటుపరం చేసిన ఘనత వారిదే. కంపెనీ ఎలా చెప్తే అలా ఎర్రజెండా యూనియన్ పని చేస్తూపోయింది. ఓపెన్ కాస్టులకు పూర్తి అనుకూలంగా వ్యవహరించారు. సాక్షాత్తు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య విశాలాంధ్ర పత్రికలో ఓపెన్ కాస్ట్ లకు అనుకూలంగా రాసిన వ్యాసం అప్పట్లో సింగరేణిలో కలకలం రేపింది.
ఆ వ్యాసం తాలూకా జ్ఞాపకాలను కార్మికులు ఇప్పటికీ చర్చించుకుంటారు. రెండుసార్లు గుర్తింపు హోదాను ఆ సంఘానికి కట్టబెట్టిన కార్మికులు, సింగరేణికి ఏఐటియుసి చేసిందేమీలేదన్న విమర్శలు ఎర్రజెండా యూనియన్ పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణిలో జరుగుతున్న ఎన్నికలు కార్మికుల భవిష్యత్తుకు ముడిపడి ఉన్నాయి. ఇదే క్రమంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పై సింగరేణి కార్మిక వర్గం ఆశలు పెట్టుకుంది. జోడో యాత్ర సందర్భంగా ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ పెద్దపెల్లి జిల్లా సింగరేణి ప్రాంతంలో పర్యటించారు. సింగరేణి ప్రైవేట్ కరణ, ఓపెన్ కాస్టులవల్ల జరుగుతున్న విధ్వంసాన్ని కార్మికులు రాహుల్ గాంధీకి విన్నవించారు. సింగరేణిలో ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని, ప్రైవేట్ కరణం అడ్డుకుంటామని కార్మికులకు ఆయన మాటిచ్చారు. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులు ప్రజలు, కోల్ బెల్టు జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు. ప్రైవేటీకరణ కాంట్రాక్ట్ కరణ కాంగ్రెస్ ప్రభుత్వం నిలువరిస్తుందన్న నమ్మకం కార్మికుల్లో బలంగా ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల విధ్వంసాన్ని పునరావృతం కాకుండా సింగరేణి కాపాడుతుందని నమ్మకంతోనే కార్మికులు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టంకట్టారు. రాష్ట్రంలో వచ్చిన అధికార మార్పును సింగరేణిలో కూడా కార్మికులు కోరుకుంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. సింగరేణి సంస్థను, కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు ఈ సారి సింగరేణి ఎన్నికల్లో సర్కార్ సంఘానికి అవకాశం ఇచ్చే మూడ్ లో కార్మికులు ఉన్నారన్న చర్చ జరుగుతుంది. అయితే ప్రభుత్వం కూడా సింగరేణి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ తరుణంలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు, మంత్రులతో ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి భేటీ నిర్వహించి సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలుపు పై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఆదేశించినట్టు సమాచారం. సింగరేణి సంస్థను కాపాడుకునే బాధ్యత కోల్ బేల్ట్ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఉందని దిశానిర్దేశo చేసినట్లు సమాచారం.
దీంతో సింగరేణి ఎమ్మెల్యేలు, మంత్రులు సింగరేణి ఎన్నికల పై ప్రధానంగా దృష్టి సారించారు. సింగరేణిలో జరుగుతున్న ప్రైవేటుకరణ, ఓపెన్ కాస్ట్ ల వల్ల జరుగుతోన్న విధ్వంసాన్ని ఐఎన్టీయూసీ యూనియన్ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వం సర్కారు సంఘం గెలిస్తే సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ గండం నుంచి బయటపడుతోoదనే ఆశాభావంలోకార్మికులు ఉన్నారు. కార్మికుల మనోభావాలకు దగ్గరగా ఇప్పటికైతే ప్రభుత్వం, ఎమ్మెల్యేలు మంత్రులు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణిలో మార్పు దిశగా కార్మికుల తీర్పు ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. సర్కార్ సంఘంగా ఐఎన్టియూసినీ గెలిపించడం కోసం కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు శక్తివంతం లేకుండా ప్రయత్నించారు. సింగరేణి కార్మికుల హక్కులు, సంస్థ పరిరక్షణ బాధ్యత కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలుగా తామే వహిస్తామనీవారు కార్మికులకు మాటిచ్చారు. ఈ నేపథ్యంలో సింగరేణి ఎన్నికల్లో 11 ఏరియాలో విస్తరించి ఉన్న 39,832 మంది కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కార్మికుల తీర్పు ఏ సంఘానికి పట్టం కడుతుందో చూడాలిమరి.