పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి

by Sumithra |
పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి
X

దిశ, లక్షెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని చందారం గ్రామానికి చెందిన కొమ్ము సతీష్ (33) అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పిడుగు పాటుకు గురై మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేసే మృతుడు గ్రామ శివారులోని తన వరి పొలంలో కలుపు తీస్తున్నాడు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో పాటు పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ కుంటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed