పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఒకరి సస్పెండ్

by Aamani |   ( Updated:2024-09-01 10:12:49.0  )
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన  ఒకరి సస్పెండ్
X

దిశ,భైంసా : బీజేపీ పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టడని మాజీ బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలాజీ సూత్రవే సస్పెండ్ చేస్తూ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఈ నెల 29 తేదీన ఉత్తర్వులు జారీచేశారు. ప్రజలలో పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినందుకు భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందని,దీనిపై వారం రోజుల్లోపు పార్టీకి వివరణ ఇవ్వాలని,ఈ ప్రతులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,నిర్మల్ జిల్లా అధ్యక్షులు,ముథోల్ శాసనసభ్యులు రామారావు పటేల్ కి సైతం అందజేశారని కార్యదర్శి ఉత్వరులలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed