- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు కృషి చేయాలి : ఆదిలాబాద్ కలెక్టర్
దిశ,ఆదిలాబాద్ : రాబోయే పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులకు మంచి మార్కులు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా ఉపాధ్యాయులను ఆదేశించారు.గురువారం స్థానిక ప్రభుత్వ బాలక్ మందిర్ పాఠశాలలో పదవ తరగతి ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాంప్లెక్స్ సమావేశాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.ఇందులో పదవ తరగతికి ఇంగ్లీష్ బోధిస్తున్న వారు ఎంత మంది హాజరయ్యారనీ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ ను గుర్తించి వారికి బోధించే విధానం గురించి తెలియజేసిన జిల్లా కలెక్టర్ పిల్లలు ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో తప్పకుండా పాస్ అయ్యే విధంగా చూస్తూనే..వారికి మంచి భోధన ఇవ్వాలని,దీనికి సంబంధించిన మూడు భాగాలు విభజించి, ఎస్సే ఎగ్జామ్ నిర్వహించారు.దీని రిజల్ట్ ప్రకారం పిల్లలను ఏ,బి,సి విభాగాలుగా గుర్తించి, వచ్చే 4 నెలల పాటు ఉదయం సాయంత్రం ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. సి క్యాటగిరి పిల్లలపై ఎక్కువ శ్రద్ధ వహించాలని తెలిపారు.ఇందుకు జిల్లా విద్యాధికారి ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సూచనలు చేయాలని కోరారు. ఇందులో డీఈవో ప్రణీత, ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.