- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్
దిశ, కొత్తగూడెం : ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం ఎస్సీ,ఎస్టీ కేసుల పై కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎస్పీ రోహిత్ రాజు,ఎస్సీ ఎస్టీ కమిషన్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ ..ఎస్సీ,ఎస్టీలకు భారత రాజ్యాంగం, చట్టప్రకారం ఉన్నటువంటి హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషి గురించి వివరించారు.పౌర హక్కుల దినం రోజున కేవలం ఎస్సీ,ఎస్టీ హక్కుల కోసం మాత్రమే కాకుండా వారి సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.అభివృద్ధి సంక్షేమ పథకాలలో ప్రథమ ప్రాధాన్యత ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వాలు ఇస్తున్నాయని, 33 శాతం సబ్సిడీతో వ్యవసాయ,ఉద్యానవన శాఖల్లో పథకాలు ఉన్నాయన్నారు.ఎస్సీ,ఎస్టీలకు ఎన్ఆర్ఈజీఎస్
ఉపాధి హామీ పథకం తో పాటు, వ్యక్తిగత ఆర్థిక అభివృద్ధి కోసం పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, వంటి పథకాలు ఉన్నాయని, అధికారులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక జిల్లా కోర్టు ఏర్పాటు కోసం సభ్యులు జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉన్నందున జిల్లా జడ్జికి వినతిపత్రం అందిస్తామని కలెక్టర్ వివరించారు. జిల్లా ఏర్పాటు సమయంలో అప్పటి కలెక్టర్ చుంచుపల్లి లో సేవాలాల్ ధ్యాన మందిరం ఏర్పాటుకు స్థలం కేటాయించారని, కానీ ఇప్పటివరకు కార్యాచరణ రూపొందించలేదని తెలిపారు. కలెక్టర్ చుంచుపల్లి తాసిల్దార్ ను పరిశీలించవలసిందిగా ఆదేశించారు.
భద్రాచలం మొబైల్ కోర్టులో జడ్జి లేకపోవడం వల్ల అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని, నియామకానికి తగిన చర్యలు చేపట్టాలని సభ్యులు తెలియజేశారు. దీనికిగాను కలెక్టర్ ఈ అంశం ప్రభుత్వం పరిచయంలో ఉందని, వీలైనంత త్వరగా జడ్జి నియామకం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఏ పీ ఓ జనరల్ ఐటీడీఏ డేవిడ్ రాజు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి అనసూయ,జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, సీపీఓ సంజీవరావు, కలెక్టరేట్ ఏవో రమాదేవి, ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులు ఎనుమురి లక్ష్మీబాయి, చింతల రవికుమార్, లౌడియా సౌమ్య లకావత్ వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.