- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఆటో బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు
దిశ, నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు మండలం నాగులూరు వద్ద ఆటో తిరగబడడంతో ఆరుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నూజివీడు మండలం అన్నవరం నుంచి రెడ్డిగూడెం సమీపంలోని నాగులూరులో వ్యవసాయ పనులకు 9 మంది కూలీలతో గురువారం ఆటో బయలుదేరింది. నూజివీడు మండలం. సిద్ధార్థ నగర్ గ్రామం రాగానే టైర్ పంచరై ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో నాగ మల్లేశ్వరి (50) రమణమ్మ (50), రజిని (43), రాజ్యలక్ష్మి (38), శ్రీదేవి (35), వెంకటరత్నమ్మ (60) లు గాయాల పాలయ్యారు. వారిని నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నాగమల్లేశ్వరి, వెంకటరత్నం లను మెరుగైన చికిత్స కోసం విజయవాడకు రిఫర్ చేశారు. నూజివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నాగులూరు ఆటో ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే మంత్రి కొలుసు పార్ధసారధి స్పందించి, భాదితుల ఆరోగ్య పరిస్థితిపై ఫోన్ ద్వారా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. నూజివీడులో బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి, తనకు తెలియజేయాలని నూజివీడులో తన క్యాంపు కార్యాలయంలోని సిబ్బందిని మంత్రి ఆదేశించారు. విజయవాడ ఆస్పత్రికి పంపించిన బాధితుల ఆరోగ్య పరిస్థితి పై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కి ఫోన్ చేసి వాకబు చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని, బాధితుల ఆరోగ్య పరిస్థితి తనకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలని మంత్రి పార్ధసారధి ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు.