- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Pawan Kalyan: త్వరలో ఆ ఖాతాలకు రూ. 750 కోట్లు
దిశ, వెబ్ డెస్క్: పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాల ప్రతినిధులకు డిప్యూటీ సీఎం, మంత్రి పవన్ కల్యాణ్(Deputy CM, Minister Pawan Kalyan) గుడ్ న్యూస్ తెలిపారు. వారితో సమావేశం నిర్వహించిన ఆయన పంచాయతీరాజ్ శాఖ నిధుల(Panchayat Raj Department Funds)పై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో పంచాయతీల ఖాతాలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.750 కోట్లు విడుదల కాబోతున్నాయని తెలిపారు. ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీ అభివృద్ధికి వినియోగించాలని పవన్ సూచించారు.
పంచాయతీల నిధులను గత ప్రభుత్వం మాదిరి మళ్లించమని పవన్ తేల్చి చెప్పారు. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని చెప్పారు. వెదురు, బయో డీజిల్ మొక్కల పెంపకంతో పంచాయతీల ఆదాయం పెరుగుతుందన్నారు. ఇంటింటికీ 24 గంటల పాటు తాగు నీరు సరఫరా చేసేందుకు జల్ జీవన్ మిషన్(Jal Jeevan Mission) పనులు జరుగుతున్నాయని చెప్పారు. పల్లె పండుగ పనుల నాణ్యతను సర్పంచులే పర్యవేక్షించుకోవాలని ఆదేశించారు. కూటమి సర్కార్ మొండి ప్రభుత్వం కాదని, సమస్యలను సానుకూలంగా వినే గవర్నమెంట్ అని తెలిపారు. పంచాయతీల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి నెలా సమావేశం నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.