- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
చేతి గోర్లు తరుచుగా విరిగిపోతున్నాయా..? అయితే, ఈ సమస్య ఉన్నట్లే..!
దిశ, ఫీచర్స్: కొంతమంది మహిళలు, యువతులు చేతి వేళ్ల గోర్లని అందంగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, అవి కొంత వరకు పెరిగి తరుచుగా విరిగిపోతుంటాయి. చేతి గోర్లను బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఆరోగ్యంలో ఏదైనా సమస్యలు ఉన్నా.. దాని సంకేతాలు గోర్లల్లో కనిపిస్తాయి. కొందరికి గోర్లు చాలా పెలుసుగా ఉండి ఎప్పుడూ విరిగిపోతుంటాయి. ఇలా ప్రతీసారి జరుగుతుంటే మీ శరీరంలో పోషకాలు తక్కువగా ఉన్నాయని తెలుసుకోండి. అయితే, ఇలా జరగడం కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతంగా చెప్పవచ్చు.
శరీరంలో కాల్షియ లోపం ఉన్నా గోర్లు బలహీనంగా మారి, తొందరగా విరిగిపోతాయి. కాలేయం వ్యాధి ఉన్ననప్పుడు కొన్ని సందర్భాల్లో గోర్లు విరిగిపోవడం, రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి విషయంలో వైద్య నిపుణులను సంప్రదించండి. శరీరంలో విటమిన్ బి-12 లోపం ఉన్నప్పుడు కణాలు సరిగ్గా ఏర్పడక అనేక సమస్యలు మొదలవుతాయి. ఈ విటమిన్ లోపాన్ని అధికమించడానికి చేపలు, గుడ్లు, పాలు, పెరుగు, చీజ్, తృణధాన్యాలు వంటివి తినడం మంచిది.
కొంతమంది మహిళల్లో ఐరన్ లోపం ఉంటుంది. ఈ లోపం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. దీని కారణంగా కూడా గోళ్లు బలహీనంగా మారి త్వరగా విరిగిపోతాయి. వీళ్లు బీట్ రూట్, దానిమ్మ, యాపిల్, అంజీర్, అరపండు, ఎండుద్రాక్ష వంటి పదార్ధాలు తినడం వల్ల ఈ సమస్యలను తగ్గించవచ్చు. అంతేకాకుండా శరీరంలో విటమిన్-ఇ తక్కువగా ఉన్నా కూడా గోరు విరగడం, నెయిల్ పెరుగుదల మందగించడం వంటి సమస్యలు వస్తాయి. ఈ లోపాన్ని తగ్గించుకోవగడానికి బాదం, పిస్తా, పొద్దుతిరుగుడు గింజలు, వేరుశెనగ, ఆకుపచ్చ కూరగాయలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.