Gutta Sukhender Reddy : ఆస్ట్రేలియాలో "మీట్ & గ్రీట్"లో పాల్గొన్న గుత్తా సుఖేందర్ రెడ్డి

by M.Rajitha |
Gutta Sukhender Reddy : ఆస్ట్రేలియాలో మీట్ & గ్రీట్లో పాల్గొన్న గుత్తా సుఖేందర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా తెలంగాణ కమ్యూనిటీ(ATC) ఆద్వర్యంలో సిడ్నీలోని ఉడ్ క్రాఫ్ట్ కమ్యూనిటీ సెంటర్ లో ఈరోజు జరిగిన " మీట్ & గ్రీట్" మరియు దీపావళి సంబరాలలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. "జన్మనిచ్చిన అమ్మ, జన్మించిన ప్రాంతం రెండు సమానమే అన్నారు. తెలంగాణ నుండి వచ్చి ఆస్ట్రేలియాలో స్థిరపడిన అయిన తెలుగు వారందరికి ప్రభుత్వం సహకారం అందిస్తుంది. రాష్ట్ర అభివృద్ధిలో విదేశాల్లో సెటిల్ అయిన తెలుగువారు అందరూ భాగస్వాములు అవ్వాలి. హైదరాబాద్ అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ను ఏర్పాటు చేసింది. దేశంలో ఎక్కడా లేని విదంగా రైతులకు రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. ఫోర్త్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. యువత కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల పేద ల పిల్లలు ఒకే చోట చదువుకునే విదంగా ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. మూసి పునరుజ్జీవనం, హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణ కోసం యుద్దమే చేస్తున్నారు. మీరు మరింతగా అభివృద్ధి చెందండి, అదేవిధంగా మన తెలంగాణ అభివృద్ధి చెందడంలో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను..." అని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed