అది అమ్మోరు శపించిన ప్రాంతం.. డిటెక్టివ్‌తో ఎంక్వైరీ చేయిస్తున్న గ్రామస్తులు (వీడియో)

by sudharani |   ( Updated:2024-11-07 13:49:06.0  )
అది అమ్మోరు శపించిన ప్రాంతం.. డిటెక్టివ్‌తో ఎంక్వైరీ చేయిస్తున్న గ్రామస్తులు (వీడియో)
X

దిశ, సినిమా: నరేష్ అగస్త్య(Naresh Agastya), మేఘా ఆకాష్ (Megha Akash) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘వికటకవి’(Vikatakavi). ప్రదీప్ మద్దాలి (Director Pradeep Maddali)దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి (Producer Ram Talluri) నిర్మిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఈ సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌వంబ‌ర్ 28 నుంచి ప్రేక్షకుల‌ ముందుకు తీసుకొస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘మధ్య రాత్రి దేవతల గుట్ట మీదకు పోయి లాంతర్ చూపియ్’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ ఎంతో మిస్టరీగా అనిపించింది. ‘మా ఊరిలో ఒక సమస్య ఉంది. అది నువ్వు తీర్చగలవని నా నమ్మకం’ అంటూ ఓ వ్యక్తి డిటెక్టివ్ (నరేష్ అగస్త్య)ను ఆ ఊరికి పంపిస్తాడు. ఇక ఆ ఊరు వెళ్లిన తర్వాత హీరోకు అనేక సవాళ్లు ఎదురవుతాయి. ‘ఇది అమ్మోరు శపించిన ప్రాంతం’ అని గుడి పూజారి చెప్తాడు. ఇలా తనకు ఎదురైన సవాళ్లను ఎలా పరిష్కరిస్తాడు.. ఇంతకు ఈ ఊరు శాపం ఏంటీ’ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ప్రజెంట్ ఈ ట్రైలర్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది.

కాగా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ (Detective web series) ఇదే కావటం విశేషం. హైదరాబాద్ (Hyderabad) విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని ‘అమరగిరి’(Amaragiri) అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. ఆ స‌మ‌స్యను గుర్తించ‌టానికి అమరగిరి వెళ్లిన డిటెక్టివ్ (Detective) రామకృష్ణ.. ఆ గ్రామానికి సంబంధించిన పురాతన కథలను, ఆధునిక కుట్రల వెనుకున్న రహస్యాలను వెలికితీస్తాడు. ఈ ప్రయాణంలో అతనికి ఎదురయ్యే సవాళ్లు, అసలు ఆ ప్రాంతంతో అతనికున్న అనుబంధం ఏంటి? అనేది ఈ సిరీస్ కథ.

Advertisement

Next Story