- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Collector : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి
దిశ, ప్రతినిధి నిర్మల్ : వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. మంగళవారం సోన్ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి సందర్శించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని సూచించారు. త్రాగునీరు టెంట్, తూకపు, తేమ యంత్రాలు, గన్ని బ్యాగ్స్, టార్పాలిన్ లు, అందుబాటులో ఉంచాలని సూచించారు. కొనుగోలు చేసిన వెంటనే ధాన్యం కేటాయించిన మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, అన్ని రకాల రిజిస్టర్ లను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, తహసీల్దార్ మల్లేష్, డిఎస్ఓ కిరణ్ కుమార్, డిఎం సివిల్ సప్లయిస్ వేణుగోపాల్, రైతులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.