పవిత్ర గంగాజలం కోసం హస్తినమడుగు చేరిన మెస్రం వంశీయులు (వీడియో)

by S Gopi |   ( Updated:2023-03-24 16:35:45.0  )
పవిత్ర గంగాజలం కోసం హస్తినమడుగు చేరిన మెస్రం వంశీయులు (వీడియో)
X

దిశ, జన్నారం: రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్‌ నాగోబా జాతర మహాపూజకు కావాల్సిన గంగాజలం కోసం మెస్రం వంశీయులు డిసెంబర్ 28న కాలినడకన బయల్దేరి మంగళవారం కలమడుగులోని హస్తిన మడుగుకు చేరుకున్నారు. గంగాపూజలు నిర్వహించి గంగజలాన్ని సేకరించి తిరుగుపయనం అయ్యారు. ఉట్నూర్‌ లో బస, 11న దోడందా, 12 నుంచి 16 వరకు విశ్రాంతి 17న ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి ఆలయానికి చేరుకుని పూజలు చేస్తామని తెలిపారు. అదేరోజు సాయంత్రం కేస్లాపూర్‌లో ఉన్న వడమర(మర్రిచెట్టు) వద్దకు చేరుకుంటామని తెలిపారు. ఆ చెట్టువద్ద మూడు రోజుల పాటు బస చేశాక 21న ఆలయ సమపంలోని గోవ్వాడ్‌కు చేరుకుంటామని, అదేరోజు రాత్రి నాగోబా ఆలయంలో మహాపూజలు చేసి జాతర ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు ప్రధాన్‌ మెస్రం దాదారావు, మెస్రం వంశీయులు కోటోడ మెస్రం కోసు, మెస్రం హన్మంత్‌రావు, మెస్రం వంశం ఉద్యోగుల సంఘం సభ్యులు మెస్రం మనోహర్‌, మెస్రం దేవ్‌రావు, మెస్రం శేఖు, మెస్రం తుకారం, మెస్రం నాగ్‌నాథ్‌, పాల్గొన్నారు.



Advertisement

Next Story

Most Viewed