- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామంలో ఏ ఒక్కరు ఆ పంట వేసిన.. గ్రామం మొత్తానికి రైతుబంధు కట్
దిశ, బోథ్: గంజాయి సాగు పూర్తి స్థాయి నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం బోథ్ మండలంలోని సాయి ఫంక్షన్ హాల్‌లో పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి సాగు, మాదక ద్రవ్యాల నిర్ములన పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్పీ వెంకటేశ్వరరావు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హాజరు అయ్యారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో మాధక ద్రవ్యాలకు అలవాటు పడి యువత తమ బంగారు భవిశ్యత్‌ను నాశనం చేసుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్క సర్పంచ్ గంజాయి నివారణకి సహకారం అందించాలని తెలిపారు. గంజాయి సాగు చేసిన వారిపై పిడి యాక్ట్ కేసులు, పది సంవత్సరాలు జైలు శిక్ష విదిస్తామన్నారు. అలాగే వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే బాపురావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గారు గంజాయి సాగు నివారణ పై ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నారని.. బంగారు తెలంగాణలో గంజాయి పూర్తిగా నిర్ములిస్తామన్నారు. ఒకవేళ ఎవరైనా గంజాయి సాగు చేస్తే వారి గ్రామం మొత్తం రైతు బంధు కట్ చేస్తాం అని తెలిపారు. ప్రతి ఒక్క సర్పంచ్ రైతులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించి గంజాయి నివారణకు భాగస్వామ్యం అవ్వాలన్నారు. అనంతరం పోలీసులతో కలిసి గంజాయిని నివారణ చేద్దాం అని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్పీ రవీందర్ రాజ్, బోథ్ సీఐ నైలు, ఎస్సై దివ్య భారతి, బజార్హత్నూర్ జెడ్పీటీసీ నర్సయ్య, జిల్లా కో ఆప్షన్ తహెర్ బిన్, ఎంపీపీ తుల శ్రీనివాస్, బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్, అయ గ్రామల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, ప్రజలు, పోలీసులు పాల్గొన్నారు.