Sirpur MLA : పశువుల అక్రమ రవాణాను అరికట్టాలి

by Aamani |
Sirpur MLA : పశువుల అక్రమ రవాణాను అరికట్టాలి
X

దిశ, తాండూరు : పశువుల అక్రమ రవాణాను సంబంధిత అధికార యంత్రాంగం అరికట్టాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ రావు డిమాండ్ చేశారు. సోమవారం తక్కలపల్లి వద్ద పట్టుబడిన గోవులను బీజేపీ, బజరంగ్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని జాతీయ రహదారి గుండా గోమాతగా పూజించే... గోవులను వ్యాపారులు, ముఠా సభ్యులు అక్రమ తరలిస్తు గోవధకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీస్ యంత్రాంగం పశువుల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచి, అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వెంట నాయకులు రేవల్లి రాజలింగం, తిరుపతి తదితరులున్నారు.

Advertisement

Next Story