- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'సింగరేణి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి'
దిశ, నస్పూర్ : సింగరేణిలో ఈ నెల 27న జరగనున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం నస్పూర్ పట్టణంలోని శ్రీరాంపూర్ ఏరియాలో జరగనున్న ఎన్నికల ఏర్పాట్లు, కౌంటర్ కేంద్రాన్ని డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్, చెన్నూర్ ఎసీపీ మోహన్, మంచిర్యాల ఆర్డిఓ రాములు, సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి.సంజీవరెడ్డి, డీజీఎం అరవిందరావుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని బెల్లంపల్లి డివిజన్లో మూడు సింగరేణి ప్రాంతాలు ఉన్నాయన్నారు. పోలింగ్ నిర్వహణ కొరకు 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఐదు రూట్ల విభజన చేశారన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఎన్నికల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.