- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సిర్పూర్ కాంగ్రెస్ ఇన్చార్జికి షోకాస్ నోటీసు

దిశ, ప్రతినిధి నిర్మల్ : ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్ కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు ఆయనకు నోటీసులు జారీ చేస్తూ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది. ఈనెల 28వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలని సూచించింది. లేని పక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని ఆ షోకాజ్ నోటీస్ లో హెచ్చరించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం...
సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్ కు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో ఆసిఫాబాద్ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతుంది. మంత్రి సీతక్క తో పాటు పార్టీని గత ఎన్నికల సమయంలో జిల్లా పరిశీలకుడిగా పనిచేసిన సత్తు మల్లేష్ లపై శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వప్రసాద్ టీపీసీసీకి ఫిర్యాదు చేశారు.
కాగా ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు బలంగా ఉన్నాయి. సిర్పూర్ ఇన్చార్జి రావి శ్రీనివాస్ సహా ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి శ్యామ్ నాయక్ తదితరులు విశ్వప్రసాద్ ను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ పై కక్షపూరితంగా ఫిర్యాదు చేశారని ఆ వర్గం ఆరోపిస్తుంది. తాజాగా శ్రీనివాస్ కు నోటీసులు జారీ కావడం చర్చనీయాంశం అవుతుంది. తాజా పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.