8 తరగతులు..ఇద్దరే టీచర్లు..

by Sumithra |
8 తరగతులు..ఇద్దరే టీచర్లు..
X

దిశ, బెజ్జుర్ : బెజ్జూరు మండలంలోని కుశ్నపెళ్లి ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు 140 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి విద్యా బోధన కోసం ప్రభుత్వం నలుగురు టీచర్లను నియమించగా, గురువారం ఇద్దరు టీచర్లు మాత్రమే విధులకు హాజరయ్యారు. మిగతా ఇద్దరు లీవ్ లో ఉన్నారు . ఒకరు మెటర్నెటి లీవ్ లో ఉండగా మరొకరు సాధారణ లీవ్ లో ఉన్నారు. దీంతో రెండు తరగతి గదుల్లో ఇద్దరు టీచర్లు విధులు నిర్వహించగా, మిగిలిన గదుల్లో విద్యార్థులు టీచర్లు లేకపోవడంతో ఖాళీగా ఉన్నారు. టీచర్ల కొరత వల్ల విద్యా బోధన సక్రమంగా జరగడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తరగతులకు సరిపడా గదులు లేకపోవడంతో వరండాలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఓకే గదిలో రెండు, మూడు తరగతులు బోధించవలసిన పరిస్థితి నెలకొంది. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తరగతులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించి, విద్యాబోధన సక్రమంగా జరిగే విధంగా చూడాల్సిందిగా బెజ్జూర్ మండల వాసులు కోరుతున్నారు. ఈ విషయమై బెజ్జూర్ ఎంఈఓ రమేష్ బాబును వివరణ కోరగా ప్రభుత్వ ఉపాధ్యాయులు నిబంధనల ప్రకారం పాఠశాలలో పనిచేయాలని తెలిపారు. కుశ్నపెళ్లి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు లీవ్ లో ఉన్నారని. ఒకరు మెటర్నటరీ, మరొకరు సాధారణ లీవ్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. పనిచేయని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed