నాణ్యమైన ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందండి : ముధోల్ ఎమ్మెల్యే

by Aamani |
నాణ్యమైన ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందండి : ముధోల్ ఎమ్మెల్యే
X

దిశ, లోకేశ్వరం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ లో డి సి ఎం ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీఏ పిడి విజయలక్ష్మి తో కలిసి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, రైస్ మిల్లర్లు తాలు, తప్ప, తేమ పేరుతో ధాన్యంలో కోత పెడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2320, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2300 చెల్లించడం జరుగుతుందని రైతులు దళారులకు విక్రయించి నష్టపో వద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి విజయలక్ష్మి, పీఎసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు,స్థానిక నాయకులు రాంగారి సాయారెడ్డి, కట్ట నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, గడిగె భోజన్న, గొల్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed