- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PAK VS ENG : అరంగేట్ర మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన పాక్ బ్యాటర్
దిశ, స్పోర్ట్స్ : తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్తాన్‌కు రెండో టెస్టులో మంచి ఆరంభమే దక్కింది. అరంగేట్ర బ్యాటర్ కమ్రాన్ గులామ్(118) సెంచరీకితోడు సైయ్ అయూబ్(77) రాణించడంతో ఆ జట్టు తొలి రోజైన మంగళవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 259/5 స్కోరు చేసింది. అయితే, మొదట్లో పాక్‌కు జాక్ లీచ్ గట్టి షాకిచ్చాడు. వరుస ఓవర్లలో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(7), కెప్టెన్ షాన్ మసూద్(3)లను పెవిలియన్ పంపాడు.
బాబర్ ఆజామ్ స్థానంలో జట్టులోకి వచ్చిన కమ్రాన్ గులామ్ అరంగేట్ర మ్యాచ్‌లోనే నిరూపించుకున్నాడు. తొలి టెస్టులోనే శతకం బాదాడు. సైమ్ అయూబ్ కూడా మెరిశాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 149 పరుగులు జోడించింది. సైమ్ అయూబ్, సౌద్ షకీల్(4) స్వల్ప వ్యవధిలోనే అవుటవ్వగా.. రిజ్వాన్‌తో కలిసి కమ్రాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసిన కాసేపటికే అతన్ని షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రిజ్వాన్(37 బ్యాటింగ్), అఘా సల్మాన్(5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ పాట్స్, బ్రైడాన్ కార్సే, షోయబ్ బషీర్ చెరో వికెట్ పడగొట్టారు.