Axis Bank: బెంగళూరులో స్టాక్ మార్కెట్ కుంభకోణం.. రూ. 97 కోట్లు నొక్కేసిన యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ బృందం

by Maddikunta Saikiran |
Axis Bank: బెంగళూరులో స్టాక్ మార్కెట్ కుంభకోణం.. రూ. 97 కోట్లు నొక్కేసిన యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ బృందం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రోజురోజుకి సైబర్ మోసాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరు(Bangalore)లో భారీ కుంభకోణం బయటపడింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్(Stock Market Trading) పేరుతో రూ. 97 కోట్ల కుంభకోణానికి పాలపడిన యాక్సిస్ బ్యాంక్ మేనేజర్(Axis Bank Manager), ముగ్గురు సేల్స్ ఎగ్జిక్యూటివ్(Sales Executives)లతో సహా ఎనిమిది మందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఆన్‌లైన్‌లో షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీగా డబ్బు సంపాదించవచ్చని బ్యాంక్ ఖాతాదారులను(Bank Customers) మోసం చేశారు. ఆరు బ్యాంకు అకౌంట్ల ద్వారా నేరగాళ్లు సుమారు రూ.97 కోట్లు దోచేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ కుంభకోణానికి సంబంధించి దేశవ్యాప్తంగా 245 కేసులు నమోదైనట్లు బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అరెస్టయిన నిందితులు వెస్ట్ బెంగళూరు(West Bangalore)లోని నాగరభావి(Nagarabhavi) యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ కిశోర్ సాహు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు మనోహర్, రాకేష్, కార్తీక్ లుగా గుర్తించారు. అలాగే మ్యూల్ ఖాతాలను నిర్వహించిన రఘురాజ్, కెంగేగౌడ, మాల సీపీ, లక్ష్మీ కాంతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ స్కామ్(Scam)కు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed