Murmu: రాష్ట్రపతి ముర్ముకు అరుదైన గౌరవం.. డాక్టరేట్‌ ప్రదానం చేసిన అల్జీరియా యూనివర్సిటీ

by vinod kumar |
Murmu: రాష్ట్రపతి ముర్ముకు అరుదైన గౌరవం.. డాక్టరేట్‌ ప్రదానం చేసిన అల్జీరియా యూనివర్సిటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మూడు దేశాల టూర్‌లో భాగంగా అల్జిరియాలో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అరుదైన గౌరవం దక్కించింది. అల్జిరియాలోని సీడీ అబ్దెల్లా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్‌లో ముర్ముకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆ దేశ ఉన్నత విద్యా మంత్రి శ్రీ కమల్ బద్దారి ముర్ముకు మంగళవారం డాక్టరేట్‌ను అందజేశారు. భారత్‌లో సైన్స్, విజ్ఞానం కోసం ఆమె చేసిన అభ్యర్థనకు గుర్తింపుగా డాక్టరేట్‌తో సత్కరించారు. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ.. వ్యక్తిగా కంటే ఇది భారత్‌కే దక్కిన గౌరవమన్నారు. విద్య ద్వారా అసమానతలను సమాజం నుంచి దూరం చేయొచ్చని తెలిపారు. చదువు అందరికీ సమాన అవకాశాలను ఇస్తుందని నొక్కి చెప్పారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, సాంకేతికతో ఎంతో దూసుకుపోతోందని కొనియాడారు. ప్రపంచ వేదికలపై మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించిందని తెలిపారు. ఐటీ రంగంలో 36 శాతం మంది మహిళలు ఉండటం ఎంతో గర్వకారణమన్నారు. తనకు డాక్టరేట్ ప్రదానం చేసిన యూనివర్సిటీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed