పాత్ బ్రేకింగ్ : డ్రీమ్స్ కమ్యూనికేషన్.. కలల ద్వారా మాట్లాడుకున్న వ్యక్తులు..

by Sujitha Rachapalli |   ( Updated:2024-10-17 16:03:50.0  )
పాత్ బ్రేకింగ్ : డ్రీమ్స్ కమ్యూనికేషన్.. కలల ద్వారా  మాట్లాడుకున్న వ్యక్తులు..
X

దిశ, ఫీచర్స్ : ఇన్సెప్షన్ మూవీ నుంచి ప్రేరణ పొందినట్లుగా.. ఇద్దరు వ్యక్తులు కలలో కమ్యూనికేట్ అయ్యారు. కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ REMspace ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. స్పష్టమైన కలలు కనడానికి, నిద్రను మెరుగుపరచడానికి సాంకేతికతను రూపొందించిన శాస్త్రవేత్తలు... ఇదే టెక్నాలజీ ఉపయోగించి నిద్రలో ఉన్నప్పుడు ఇద్దరు మానవుల మధ్య సందేశాన్ని మార్పిడి చేయగలిగారు. ఇందుకు ప్రత్యేకంగా రూపొందించిన పరికరాలను ఉపయోగించారు. సర్వర్, అపరేటస్, వైఫై, సెన్సార్స్ వినియోగించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.

అధ్యయనం సమయంలో ఇద్దరు వేరు వేరు ఇళ్లలో పడుకున్న పార్టిసిపెంట్స్ మెదడు తరంగాలను రిమోట్‌గా ఆపరేటస్ ద్వారా ట్రాక్ చేశారు. డేటా సర్వర్‌లోకి ఫీడ్ చేయబడింది. సర్వర్‌లో ఒక వ్యక్తి స్పష్టమైన కలలోకి ప్రవేశించినట్లు గుర్తించబడింది. ప్రత్యేక భాషని ఉపయోగించి యాదృచ్ఛిక పదాన్ని సృష్టించి అతని ఇయర్‌బడ్‌ల ద్వారా ప్రసారం చేయబడింది. ఆయన కలలో సేమ్ వర్డ్ రిపీట్ చేశాడు. అప్పుడు రెస్పాన్స్ రికార్డు చేసి సర్వర్ లో స్టోర్ చేయబడింది. ఎనిమిది నిమిషాల తర్వాత రెండవ పార్టిసిపెంట్ స్పష్టమైన కలలోకి ప్రవేశించాడు. మొదటి పార్టిసిపెంట్ నిల్వ చేసిన సందేశం సర్వర్ ద్వారా తనకు ప్రసారం చేయబడింది.

కాగా ఈ ప్రయోగం గురుంచి మాట్లాడిన శాస్త్రవేత్తలు.. ఇది ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ మాదిరిగా అనిపించినా.. భవిష్యత్తులో సర్వసాధారణం అయిపోతుందని చెప్పారు. ఇది నిద్ర పరిశోధనకు ఒక ప్రధాన మైలురాయిగా మారుతుందని.. మానసిక ఆరోగ్య చికిత్స, నైపుణ్యాల శిక్షణలో సహాయపడుతుందని తెలిపారు.



Advertisement

Next Story

Most Viewed