- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPad Mini: భారత మార్కెట్లో కొత్త ఐప్యాడ్ మినీని విడుదల చేసిన యాపిల్
దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐప్యాడ్ మినీని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. యాపిల్ ఇంటిలిజెన్స్ సపోర్ట్‌తో వచ్చిన ఈ కొత్త ఐప్యాడ్ మినీ 7వ తరం మోడల్‌లో ఏ17 ప్రో చిప్‌ని వాడారు. అయితే, ఐప్యాడ్ మూడు సంవత్సరాల బ్రేక్ తర్వాత అప్‌గ్రేడ్‌తో మార్కెట్లోకి రావడం గమనార్హం. ముఖ్యంగా యాపిల్ ఇంటిలిజెన్స్ సపోర్ట్‌తో వస్తుండటంతో కొత్త ఐప్యాడ్ మినీ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండనుంది. అంతేకాకుండా ఇది 64జీబీకి బదులుగా 128 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. మొత్తం మూడు స్టోరేజ్ ఆప్షన్లతో వస్తున్న ఐప్యాడ్ మినీ 128తో పాటు 256జీబీ, 512జీబీలలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 49,900, రూ. 59,900, రూ. 79,900తో అందుబాటులో ఉంటాయి. యాపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, స్టోర్‌లలో లభిస్తాయి. అక్టోబర్ 23వ తేదీ నుంచి కొనుగోళ్లు మొదలవుతాయని, ప్రీ-ఆర్డర్లు యాపిల్ వెబ్‌సైట్ ద్వారా ఇప్పటినుంచే అవకాశం ఉందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.