- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Women's T20 World Cup : కీలక పోరులో ఇంగ్లాండ్‌పై విండీస్ గెలుపు.. సెమీస్‌కు దూసుకెళ్లిన కరేబియన్ జట్టు
దిశ, స్పోర్ట్స్ : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ సెమీస్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించింది. దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో విండీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 141 స్కోరు చేసింది. నాట్ స్కివర్ బ్రంట్(57) హాఫ్ సెంచరీతో మెరవగా.. కెప్టెన్ హీతర్ నైట్(21) విలువైన పరుగులు జోడించింది. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్(3/21), హేలీ మాథ్యూస్(2/35) సత్తాచాటారు.
అనంతరం 142 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 18 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్(50), కియానా జోసెఫ్(52) హాఫ్ సెంచరీలతో మెరిసి జట్టు విజయాన్ని సునాయాసం చేశారు. ఇంగ్లాండ్‌పై 13 మ్యాచ్‌ల తర్వాత విండీస్ మహిళలు గెలుపు రుచిచూశారు.
అలాగే, 2018 టీ20 ప్రపంచకప్ తర్వాత కరేబియన్ జట్టు తొలిసారిగా సెమీస్‌కు చేరుకుంది. కరేబియన్ జట్టు(6 పాయింట్లు, +1.536) గ్రూపు-బిలో అగ్రస్థానంతో సెమీస్ బెర్త్ దక్కించుకుంది. సౌతాఫ్రికా(6 పాయింట్లు, +1.382) రెండో స్థానంతో ముందడుగు వేసింది. కీలక మ్యాచ్‌లో ఓడి మెరుగైన నెట్‌రన్‌రేట్ లేకపోవడంతో ఇంగ్లాండ్(6 పాయింట్లు,+1.091) సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. గెలిస్తే టాప్ పొజిషన్‌లో నిలిచేది. గ్రూపు-ఏ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.